1814
Jump to navigation
Jump to search
1814 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1811 1812 1813 - 1814 - 1815 1816 1817 |
దశాబ్దాలు: | 1790లు 1800లు - 1810లు - 1820లు 1830లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు[మార్చు]
- ఫిబ్రవరి 1: ఫిలిప్పీన్స్ లోని మాయోన్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది
- ఫిబ్రవరి 1: లార్డ్ బైరన్ రాసిన ది కార్సెయిర్ అనే ఆత్మకథ విడుదలై ఈ రోజున 10,000 కాపీలు ఆమ్ముడైంది.[1]
- ఫిబ్రవరి 11: నార్వే స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
- మే 30: మొదటి పారిస్ ఒప్పందం కుదిరింది. అదే రోజున నెపోలియన్ను ఎల్బా ద్వీపానికి ద్వీపాంతరవాస శిక్షను విధించరు. దాని ప్రకారం కారైక్కల్ ప్రాంతం ఫ్రెంచి వారి వశమైంది. మాల్టా ఒక బ్రిటిషు కాలనీగా మారిపోయింది.
- జూలై 25: జార్జ్ స్టీఫెన్సన్ తన తొలి ఆవిరి లోకోమోటివ్ ను పరీక్షించాడు.
- ఆగస్టు 13: లండన్లో ఆంగ్లో డచ్చి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం 1803 తరువాత డచ్చి వారినుండి ఇంగ్లాండు ఆక్రమించుకున్న భూభాగాలు చాలావరకు వెనక్కి ఇచ్చెయ్యాలి. కొచ్చిన్ను డచ్చివారు బ్రిటిషు వారికి ఇచ్చెయ్యాలి. ఈ ఒప్పందంతో భారతదేశంలో డచ్చి వారి ఉనికి లేకుండా పోయింది.
- ఆగస్టు 24-25: బర్నింగ్ ఆఫ్ వాషింగ్టన్ దాడి జరిగింది.
- సెప్టెంబరు 16: థామస్ మన్రో, మద్రాస్ గవర్నర్ పదవి స్వీకరించాడు
- నవంబరు 30: బ్రిటిషు సైన్యం డెహ్రాడూన్ను స్వాధీనం చేసుకుంది
- తేదీ తెలియదు: 31 వ శృంగేరి శారదా పీఠాధిపతిగా అభినవ సచ్చిదానంద భారతి II అధిరోహించాడు.
- తేదీ తెలియదు: కలకత్తా మ్యూజియాన్ని స్థాపించారు
జననాలు[మార్చు]
- మే 7: రాబర్ట్ కాల్డ్వెల్: ప్రఖ్యాత ద్రవిడ భాషావేత్త. (మ. 1891)
- తేదీ తెలియదు: తాంతియా తోపే, స్వాతంత్ర్య సమర యోధుడు (మ. 1859)
- తేదీ తెలియదు: మన్నెంకొండ హనుమద్దాసు, వాగ్గేయకారుడు. (మ. 1874)
- తేదీ తెలియదు: భానుభక్త ఆచార్య, నేపాలీ కవి (మ.1868)
మరణాలు[మార్చు]
- జూన్ 14: డేవిడ్ బ్రౌన్, భారతదేశానికి వచ్చిన క్రైస్తవ మతప్రవక్త. ఇతడు ఆంధ్రభాషాభివృద్ధికి విశేషమైన కృషి చేసిన ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తండ్రి. (జ.1763 )
పురస్కారాలు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ Jones, Neal T., ed. (1984). A Book of Days for the Literary Year. London; New York: Thames and Hudson. ISBN 0-500-01332-2.