ఈ కథ – సృష్టికి, సృష్టికర్తకూ ఉన్న సంబంధం గురించి; మానవీయతకు, అమానవీయతకూ ఉన్న సంబంధం గురించి; వికారానికి, అందానికీ ఉన్న సంబంధం గురించి; మేధకు, ఉద్వేగానికీ ఉన్న సంబంధం గురించి; శాస్త్రజ్ఞానానికి, యథార్థానికీ ఉన్న సంబంధం గురించి; ప్రకృతికి, మనిషికీ ఉన్న సంబంధం గురించి సరికొత్త వ్యాఖ్యానం.

సాలిపురుగు శ్రద్ధగా తన పట్టుని అల్లుతుందన్నమాట. ఎంత సన్నదారమో. దాని ఒంటినుంచి వొస్తుందా దారం మరి! అర్థచంద్రాకారాల దారాలని మజ్జి దారానికి వేళ్ళాడబెడుతూ చకచకా అటోసారి ఇటోసారీ అతికేస్తూ అల్లేస్తుంది! దాని పనివాడితనాన్ని అమ్మ పనివాడితనాన్ని మెచ్చుకున్నట్టు మెచ్చుకోవలిసిందే!

జిబ్రాల్టర్ జలసంధి దక్షిణ తటాన, మధ్యధరా సముద్రం అట్లాంటిక్ మహాసముద్రాన్ని పలకరించే చోట కాపలా సిపాయిలా నిలచి ఉండే నగరం టాంజియర్. ఆ జలసంధి ఎంతో సన్నపాటిది. ఒకచోట భూభాగాల మధ్య దూరం పదమూడు కిలోమీటర్లే. విరామమంటూ లేకుండా కార్యకలాపాలు సాగే సముద్ర మార్గాలలో జిబ్రాల్టర్ జలసంధి ప్రముఖమైనది.

చిరాకు తగ్గని గణపతమ్మ ముఖాన్ని చూస్తూ కొన్ని క్షణాలు నిలబడ్డవాడు ఏమనుకున్నాడో, హఠాత్తుగా పరిగెత్తుకెళ్ళి గణపతమ్మ లావుపాటి శరీరాన్ని గట్టిగా హత్తుకున్నాడు. బియ్యం నానబెట్టిన గిన్నెని కోపంగా వంటగట్టు మీద పెట్టి, పెంటను తొక్కిన దానిలా ఛీ! అని పక్కకు జరిగి నిలబడింది గణపతమ్మ.

నాకన్నా అయిదున్నర సంవత్సరాలు పెద్ద అయిన నా పెద్దన్నకు అప్పటికే, అంటే 1962 ప్రాంతాలకు, తెలుగులో పద్యవిద్య పట్టుబడింది. ఆంధ్రదేశంలో నారాయణాచార్యుల వంటి మహాత్ములకు బాగా దగ్గరగా ఉన్నవారిని కాస్త మినహాయిస్తే, ఈమాత్రం ఆమాత్రం తెలుగు పద్యవిద్యలో ప్రవేశం ఉన్నవాళ్ళకి సన్నిధిలోనో, ఏకలవ్యంగానో విశ్వనాథే గురువు. ఇంత అయినా కాలేజీకి రాగానే శ్రీశ్రీ చక్రారాధన అలవడింది.

మాకు ఆకలిగా ఉంది, తను ఏమేమి తెచ్చి ఉంటాడా అని అత్రుతగా చూస్తున్నాం, పెట్టినదాన్ని పెట్టినట్లు గుటుక్కుమనిపించాలని తొందర కూడా పడుతున్నాం. వాసు ఆ భోజనపు పొట్లాన్ని జాగ్రత్తగా విప్పాడు. అందులో ఉన్నది చూసి నేనూ నా మిత్రుడు నిర్ఘాంతపోయాం, నివ్వెరపోయాం, ఖంగుతిన్నాం, నిశ్చేష్టులమయ్యాం!

పదునైన దృశ్యాలు
పాముల్లా పడగవిప్పి
బుసకొడుతున్న గగుర్పాటు
వికృత శబ్దాలకు
గుండెనదిలో పెరుగుతున్న
భయపు నీటిమట్టం

కాళ్ళు భూమిలో పాతేసినట్టు కదలడానికి మొరాయించాయి. చిమన్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అతడు చెప్పింది కరెక్టే. ఇక్కడ నుంచి లేచి వెళ్లాలి నేను. ఆమె ఏ క్షణంలో ఏం చేస్తుందో? బాగ్ లోంచి కత్తి తీసి పొడిస్తే మాత్రం ఎవరు చూడొచ్చారు? అసలు ఆమె ఒక చేత్తో తోస్తే చాలు నేను కుప్పకూలిపోతాను. అంత బలంగా ఉన్నాయి ఆమె చేతులు. కొంపదీసి కరుడుగట్టిన నేరస్తుడెవరైనా ఆ బుర్ఖాలో లేడు కదా? వెన్నులో చలి పుట్టింది.

దామెర్ల రామారావు జీవితకాలంలోనే ఇంతటి ప్రశంసలను అందుకున్నారు. కానీ ఈరోజు భారతదేశంలో రామారావును ఎరిగినవారు ఎవరూ లేరనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అరకొర జ్ఞాపకాలే మిగిలాయి. ఆంధ్రదేశ వీరగణంలో అస్పష్టమూర్తిగానే రామారావు నిలిచారు. జాతీయ ఆధునిక చిత్రకళ గ్యాలరీలో దామెర్ల చిత్రాలు మచ్చుకు ఒక్కటైనా కనిపించవు.

మధ్యాహ్నం, అతడికి తను వండిన ఇండియన్ డిష్, రొట్టె మడుపులో, స్వయంగా నోటి కందిస్తే, గోధుమ కనుపాపల, ఆశ్చర్యపు అరక్షణపు నిస్టాగ్మస్. ఆ పై ప్రతి బైట్‍కూ, సంభోగ పరాకాష్ఠాసమయపు కూజితాలు వెలువడ్డాయ్ అతని గొంతులోంచి. ‘ఎవ్రి‌ధింగ్ సీమ్డ్ ఎక్జాట్‍లీ రైట్, ఒళ్లంతా కోన్యాక్‍లా వెచ్చగా జ్వలించింది.’ అన్నాడు. భోజనానంతర పునర్భవ కామ వాంఛలు, భోగినీ దండకాలకే ఉచితాలు.

‘ఈ గొప్ప చిత్రకారుడు దామెర్ల రామారావు ఇరవై ఎనిమిదేళ్ల చిన్న వయసులోనే కాలం చెందారు గానీ, ఆయన కనక పూర్ణాయుష్కులు అయి ఉంటే…’ అని కొందరు పెద్దమనుషులు సభా సంప్రదాయాలననుసరించి ఊపిరి పొడుగ్గా వదులుతారు గానీ పూర్ణాయుష్కులు అయి ఉంటే మాత్రం ఏమవుతుంది?

నేను వంద మాటలు మాట్లాడితే
నువ్వు ఒక్క నవ్వు నవ్వుతావు.
నేను మౌనంగా ఉంటే
కలవరంతో
ఎలా ఉన్నావు, జాగ్రత్త అంటావు.
ఇక, ఆ మాటతో
నేను నదినై గలగలమంటానా

సమర్థుడు, ఉత్తముడు, సాధు ప్రవర్తనుడైన కుణాలుడి విషయంలో తన మోహాన్ని, ప్రేమను అదుపు చేసుకోలేకపోయింది తిష్యరక్షిత. ఉద్యానవనంలో ధ్యానంలో ఉన్న అతనిని కౌగిలించుకొని తన కోరికను వెల్లడించింది. కుణాలుడు ఆమెను సున్నితంగానే తిరస్కరించాడు. తల్లిలాంటి దానివి అని ఆమె పాదాలకు నమస్కరించి వెళ్లిపోయాడు. తండ్రికి కూడా ఈ విషయాన్ని తెలియనివ్వలేదు.

మాటా మాటా పేర్చుకుని
ఒక వంతెన కట్టుకోవడం కష్టం కానీ
ఏదో అనుమానమో
అసంతృప్తో
గాలి బుడగలా పగిలిపోవడం
ఏమంత కష్టం కాదు

నవల చదివేవారికి చిత్రకళ, చరిత్ర, రంగుల లోతుపాతులు తెలియకపోతే ఏమీ అర్థం కాదన్న సంశయం, కళాకారుడి కళామయ జీవితం దేనికన్న సంశయం కంటే, ఒక ఆర్టిస్టుకి కళ పట్ల, జీవితం పట్ల గల అగాధపు లాలస గుండె నిండిపోయేలా కనిపిస్తుంది. అతడి జీవన వైరుధ్యాన్ని ప్రతి సెంటీమీటరు తాకి, స్పందించగల నిర్మాణం ఈ నవలలో ఉంది.

ఇందులో ఉన్నది క్రమాలంకారం. వరుస క్రమంలో ఒకదానిపై మరొకటివైరంతో ఉన్నట్లుగా వర్ణన. అంటే, తుమ్మెదలు సంపంగి పూలపై వాలవు, కానీ సీత అలకలు అంటే ముంగురుల కిందనే సంపంగి వంటి ముక్కు ఉంది. అందువల్ల తుమ్మెదల పై సంపెంగలదాడి వలె ఉంది. అట్లాగే తామర పూలకు చంద్రునికి వైరం. కానీ ఇక్కడ ఆమె చేతులు పద్మాల వలె ఉంటే వాటితో ముఖమనే చంద్రుణ్ణి మన్మథుడు వైరిగా ఏర్పరచాడు.

క్రితం సంచికలోని గడినుడి-65కి మొదటి ఇరవై రోజుల్లో పద్నాలుగు మంది నుండి మాత్రమే సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-65 సమాధానాలు.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కథల పోటీ-2022కి కథలకు ఆహ్వానం! కథలు చేరవలసిన ఆఖరుతేదీ: మే 10, 2022.