ముఖ్యమంత్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతదేశం
Emblem of India.svg

ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం.


కేంద్ర ప్రభుత్వం

రాజ్యాంగం


ఇతర దేశాలు


భారతదేశంలో రాష్ట్రాల ప్రభుత్వాధినేతను ముఖ్యమంత్రి అంటారు. శాసనసభలో కనీస ఆధిక్యత కలిగిన పార్టీ లేదా కూటమికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి శాసనసభ లేదా శాసనమండలి సభ్యుడై ఉండాలి. అయితే ఏ సభలోనూ సభ్యుడు కాకున్నా ముఖ్యమంత్రి పదవి చేపట్టవచ్చు, కానీ 6 నెలలలోపు ఏదో ఒక సభలో సభ్యత్వం పొందాలి.ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి రాష్ట్ర పరిపాలనకు బాధ్యుడు. గవర్నరు పేరిట పరిపాలన జరిగినప్పటికీ, అధికారం యావత్తూ ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. పరిపాలనలో తనకు సహాయంగా ఉండేందుకు మంత్రివర్గాన్ని నియమించుకుంటారు.

ఎంపిక విధానం[మార్చు]

భారత రాజ్యాంగం, ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసే అభ్యర్థికి అర్హతా నియమావళిని నిర్దేశించింది.

● అభ్యర్థి భారత పౌరుడు అయ్యి ఉండాలి.

● 25 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి.

● రాష్ట్ర శాసనసభలో సభ్యుడు అయ్యి ఉండాలి. సభ్యత్వం లేని యెడల, అభ్యర్థి గవర్నర్ ఆమోదం కలిగి ఉండాలి.

అట్టి పరిస్థితిలో అభ్యర్థి ముఖ్యమంత్రిగా బాధ్యతను స్వీకరించిన నాటి నుండి ఆరు మాసాల కాల వ్యవధిలోపు శాసనసభా సభ్యత్వాన్ని పొందాలి. లేని పరిస్థితిలో ముఖ్యమంత్రి పదవి నుండి అభ్యర్థి తొలగించబడతారు.

వివిధ రాష్ట్రాల ప్రస్తుత ముఖ్యమంత్రుల జాబితా[మార్చు]

వ.సంఖ్య రాష్ట్రం పేరు పదవీ స్వీకారం పార్టీ జాబితా
1 ఆంధ్ర ప్రదేశ్ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 2019 - may -28 వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరు
2 తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2014 - జూన్-02 తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి
3 అరుణాచల్ ప్రదేశ్ పెమా ఖాండు 31 డిసెంబర్ 2016 భారతీయ జనతా పార్టీ అందరు
4 అస్సాం తరుణ్ కుమార్ గోగోయి 2001 మే 17 కాంగ్రెసు పార్టీ అందరు
5 బీహార్ నితీష్ కుమార్ 2005 నవంబర్ 24 జనతా దళ్ (యునైటెడ్) అందరు
6 చత్తీస్‌గఢ్ డా. రమణ్ సింగ్ 2003, డిసెంబరు 7 భారతీయ జనతా పార్టీ అందరు
7 ఢిల్లీ షీలా దీక్షిత్ 1998, డిసెంబరు 3 కాంగ్రెసు పార్టీ అందరు
8 గోవా దిగంబర్ కామత్ 2007, జూన్ 8 కాంగ్రెసు పార్టీ అందరు
9 గుజరాత్ విజయకుమార్ రబానీ 2001, అక్టోబరు 7 భారతీయ జనతా పార్టీ అందరు
10 హర్యానా భూపిందర్ సింగ్ హూడా 2005, మార్చి 5 కాంగ్రెసు పార్టీ అందరు
11 హిమాచల్ ప్రదేశ్ వీరభద్ర సింగ్ 2012 డిసెంబర్ 26 కాంగ్రెస్ పార్టీ అందరు
12 జమ్మూ కాశ్మీరు మెహబూబా మఫ్టి సయీద్ 4 ఏప్రిల్ 2016 పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అందరు
13 జార్ఖండ్ అర్జున్ ముండా 2010, సెప్టెంబరు 14 అందరు
14 కర్ణాటక సదానందగౌడ 2011 ఆగష్టు 4 భారతీయ జనతా పార్టీ అందరు
15 కేరళ ఊమెన్ చాంది 2011, మే 18 ఎల్.డి.ఎఫ్ అందరు
16 మధ్య ప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్ 2005 నవంబర్ 29 భారతీయ జనతా పార్టీ అందరు
17 మహారాష్ట్ర పృథ్వీరాజ్ చవాన్ 2008, డిసెంబరు 8 కాంగ్రెసు పార్టీ అందరు
18 మణిపూర్ ఓక్రాం ఇబోబి సింగ్ కాంగ్రెసు పార్టీ అందరు
19 మేఘాలయ ముకుల్ సంగ్మా 2010, ఏప్రిల్ 20 కాంగ్రెసు పార్టీ అందరు
20 మిజోరం లాల్‌తన్ హావ్లా 2008, డిసెంబరు 7 మిజో నేషనల్ ఫ్రంటు అందరు
21 నాగాలాండ్ నిఫూరియో 2008, మార్చి 12 అందరు
22 ఒడిషా నవీన్ పట్నాయిక్ బిజూ జనతా దళ్ అందరు
23 పాండిచ్చేరి ఎన్.రంగస్వామి కాంగ్రెసు పార్టీ అందరు
24 పంజాబ్ ప్రకాశ్ సింగ్ బాదల్ శిరోమణి అకాలీదళ్ అందరు
25 రాజస్థాన్ అశోక్ హెగ్లాట్ కాంగ్రెస్ పార్టీ అందరు
26 సిక్కిం పవన్ చామ్లింగ్ సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంటు అందరు
27 తమిళనాడు ఓ.పన్నీర్ సెల్వం డిశంబరు 6, 2016 ఏ.ఐ.ఏ.డి.ఎం.కె అందరు
28 త్రిపుర మాణిక్ సర్కార్ వామపక్ష ఫ్రంటు అందరు
29 ఉత్తరాంచల్ రమేష్ పొఖ్రియార్ భారతీయ జనతా పార్టీ అందరు
30 ఉత్తర ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ 19 మార్చి 2017 భారతీయ జనతా పార్టీ అందరు
31 పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ 2011, మే 20 వామపక్ష ఫ్రంటు అందరు

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]