Facebookలోని పేర్లు

వ్యక్తులు తాము ఎవరితో కనెక్ట్ అవుతున్నారో తెలుసుకోగలరని నిర్ధారించుకోవడానికి, మేము ప్రతి ఒక్కరినీ వారి దైనందిన జీవితంలో ఉపయోగించే అదే పేరును Facebookలో ఉపయోగించవలసిందిగా కోరతాము. మీ Facebook ఖాతాలోని పేరు మరియు మీరు పిలువబడే పేరు ఒకటే అని నిర్ధారించవలసిందిగా మేము మిమ్మల్ని కోరవచ్చు.
మీ పేరుని నిర్ధారించడం
మీరు లాగిన్ చేసినప్పుడు మీ పేరును నిర్ధారించమని కోరే సందేశం మీకు కనిపించినట్లయితే, మీ ఖాతాలో పేరును నిర్ధారించడానికి లేదా సవరించడానికి మేము మీతో కలిసి పని చేస్తున్నప్పుడు మీరు నిర్దిష్ట Facebook ఫీచర్‌లను తాత్కాలికంగా యాక్సెస్ చేయలేరు.
మీ పేరుని నిర్ధారించడానికి లేదా సవరించడానికి, మీ Facebook ఖాతాకు లాగిన్ చేసి, స్క్రీన్‌పై కనిపించే సూచనలను ఫాలో అవ్వండి. మీరు దైనందిన జీవితంలో ఉపయోగించే పేరును చూపేలా మా ID జాబితా (ఉదా: సభ్యత్వం కార్డ్‌లు, మెయిల్) నుండి ఒక IDని లేదా మరేదైనా అప్‌లోడ్ చేయవలసిందిగా మిమ్మల్ని అడగవచ్చు.
Facebookలో మీ పేరుని ఉపయోగించడం
మీరు మీ దైనందిన జీవితంలో ఉపయోగించే పేరు మీ చట్టపరమైన పేరుకు భిన్నమైనదిగా ఉండవచ్చని మేము అర్థం చేసుకున్నాము. మీరు మీ Facebook ప్రొఫైల్‌లో ఎక్కువగా గుర్తించబడే పేరును ఉపయోగించగలరని మేము కోరుకుంటున్నాము.
మీ పేరును మార్చడం లేదా అదనపు పేర్లను జోడించడం
అలాగే మీరు మీ పేరుని మార్చవచ్చు లేదా మీ ప్రొఫైల్‌కు అదనపు పేర్లను (ఉదా. మారుపేరు, పుట్టింటి పేరు) జోడించవచ్చు. మీరు 60 రోజులకు ఒకసారి కంటే ఎక్కువసార్లు మీ పేరును మార్చలేరని గుర్తుంచుకోండి.
మీ గోప్యతను నిర్వహించడం
Facebookలో మీ పేరును ఉపయోగించడం గురించి మీరు ఆందోళన చెందుతున్నట్లయితే, మీ గురించి వ్యక్తులు చూడగలిగే సమాచారాన్ని నిర్వహించడంలో మీకు సహాయపడగల టూల్‌లు మా వద్ద ఉన్నాయి.