అక్కా! ఇలాగ్గానే నే దిగినరోజునే నా ఒడియా స్నేహితుడు మిశ్రా ఇంట్లో ఆవు ఈనింది. భలే మంచి వేళన ఒచ్చేనే! జున్ను పెడతావన్న మాట అన్నా. జున్నేవిఁటీ అన్నాడు మిశ్రా. ఆవు ఈనిందిగా అన్నా. ఆయన చెప్పింది విని ఆశ్చర్యపోయా. వాళ్ళు జున్ను వొండుకోరట. ఆవుకీ పురుడు పాటిస్తారట. శుచి అయ్యేవరకూ పాలు పిండుకొని వాడుకోరట!

ఉన్నట్టుండి నా ఎడమచెవి తీవ్రంగా మండినట్లు ఒక భావన అనిపించింది. ఎందుకా మంట? ఏమిటా కథ? అని లోకంలోకి వచ్చి చూస్తే, మా లెక్కల మాష్టారు నా చెవి పట్టుకుని మెలి తిప్పుతున్నాడు. ‘వెధవా, చెప్పిన లెక్క చెయకపోగా పైగా నన్ను ఎగతాళి చేస్తున్నావుట్రా? లే రాస్కల్? లే!’ నాకు ఏమీ అర్థం అవలేదు.

నమీరూ అతని భార్యా చక్కని ఆతిథ్యమిచ్చే మనుషులు. ఆ రియాద్ వాళ్లిద్దరి చిన్నపాటి సుందర ప్రపంచం. ప్రపంచపు నలుమూలలనుంచీ వచ్చే అతిథులతో దాన్ని పంచుకోవడం వారికి ప్రీతిపాత్రమైన విషయం. ఫెజ్ నగరంతో స్నేహ సామరస్యాలు సాధించడంలో నమీర్ నాకు ఎంతో సాయంచేశాడు. చక్కని సలహాలూ సూచనలూ ఇచ్చాడు.

తన 17వ యేటే తన డైరీలో రాసుకున్న వాక్యాలను చూస్తే ఆమె తదనంతర జీవితం, సాహిత్యం ఎలా ఉంటాయో తెలుస్తుంది. ‘పిరికివాళ్లంటే నాకిష్టం లేదు. వివాహం విషయంలో నాకో అనుమానం. నిజంగా భర్త తెలివైనవాడైతే తన భార్య భీరువుగా ఉంటే సహించగలడా?’ అంటుంది. భయం, సంకోచం స్త్రీల లక్షణం అనే భావజాలాన్ని చాలా చిన్నతనం నుంచే ఆమె వ్యతిరేకించేది.

ప్రతీవారం ఒక రోజు అపార్ట్‌మెంట్ మెట్లన్నీ కడిగే నియమం ఒకటి ఉంది. కొన్ని ఏళ్ళ వరకు ఇది ప్రతీ శుక్రవారం రాత్రి జరిగే తంతు. ఎదుగుతున్న వయస్సులో అలా మెట్లు కడిగే దృశ్యాన్ని చూస్తే అనాలోచితంగా ఆనందపు రవ్వలు ఎగిసేవి లోపలెక్కడో… వచ్చే వారాంతపు సెలవులని ఊహించుకుంటూ. ఇన్నేళ్ల తరవాత అదే దృశ్యాన్ని చూస్తే ఇవాళ గురువారమే. ఏళ్ళు గడుస్తుంటే అక్కడక్కడే మార్పు చెందుతున్న జీవిత చిహ్నాలు.

అనుకోకుండా పాదాల మీద
చిన్న స్పర్శ
పక్కమీద చిన్న ముడత
గాలి కెరటాల హోరు
ఎక్కడో కాంతి రొద
ఇంక ఈ రాత్రి
నిరీక్షణే

నేను అన్నాను: నువ్వు నిశ్చింతగా కూర్చున్నావు. లే, అంటరానితనాన్ని నిర్మూలించు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమని కలిగించు. హిందువులు తమలో తాము మతం గురించి కొట్టుకుంటూ ఉంటారు. బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియ వగైరా కులాలన్నింటిని ఒకటి చేయండి. హిందూ ముస్లిములని కలపండి. లోకంలో శాంతి నెలకొనేలా ప్రయత్నాలు చేసేస్తే, ఆ పైన అందరం కలిసి ఆరాముగా జీవితాన్ని గడుపుదాం.

తెల్లారి లేస్తే
ఎక్కడెక్కడి చెత్తనో తెచ్చి
నీ ముంగిట్లో గుమ్మరించేస్తారు

కొద్దిపాటి మంచిని
చెత్తకుప్ప నుంచి
వేరు చేసుకోవడం
చెప్పనలవికానంత కష్టం

మట్టిపొద్దులు మౌనంగా నిర్మించిన
సుగంధాల పడవలు
మట్టికొలనులో మునిగిపోవడానికి
పెద్ద పెద్ద అలలతో పనిలేదు
గాలి తరగల తాకిడి
సుతారంగా సోకితే చాలు!

ఒకరోజు రాత్రి పొడుగాటి హాల్లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ జంపకాన పరిచి, కొన్ని తలగడలు పడేసుకుని పడుకున్నాం. నూనె మరకలతో కనీసం గలీబులైనా లేని ఆ తలగడల అందం చూసి తీరాలి. పైన ముదురు రంగు గుడ్డ, లోపలేమో గడ్డ కట్టిన దూది ఉండలుగా పైకి కనిపిస్తూ ఉండేది. రోజంతా ఒళ్ళు హూనమయ్యేలా ఆటలాడిన పిల్లలం తలగడ మీద తల ఆనీ ఆనగానే నిద్రలో పడేవాళ్ళం. అవి రాళ్లలా ఉంటే మాత్రం ఎవడిక్కావాలి గనక?

నది ఒడ్డునే నువ్వు పరిగెత్తి పరిగెత్తి
రొప్పుతూ ఆగిపోతావు
ప్రాణం కడగట్టుతుంది
అందీ అందకుండా అది సాగిపోతుంది

దాహం తీరదు
తపన ఆగదు

ఆ రోజంతా ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాను. ఆయనలాంటి చక్కని మాటకారిని నేను చూడలేదు. కాలక్షేపం, తత్వం, సాహిత్యం, విజ్ఞానశాస్త్రం అని ఒక అంశంనుండి మరో అంశానికి జంప్ చేస్తూ! జేమ్స్ బాండ్‌లాగా కార్ నుండి హెలికాప్టర్‌కి ఎగిరి, ఆక్కణ్ణుండి బోట్‌లోకి దూకి, ఒడ్డుచేరుకుని, అక్కణ్ణుంచి బైక్ ఎక్కి వేగంగా వెళ్ళిపోతున్నట్టు. ఆ రోజునుండి వారానికి మూడు రోజులైనా ఆయన్ని కలవడానికి వెళ్ళేవాణ్ణి. పుస్తకాలు ఇచ్చేవారు.

పార్టీ ఐపోయింది, గుంపు చెదిరిపోతూంది. ఇంకో రెండు నిమిషాలు గడిస్తే, తలుపు తోసుకుని బైటపడితే చాలు, విముక్తి. ఆశ్చర్యంగా ఇద్దరం ఒకేసారి బరువు తలుపు హేండిల్‌పై మోపిన చెయ్యి, స్తంభించిన నా ఊపిరి, బైట అతడు నాకు తొడిగే కోట్, సవరించే కాలర్, మర్యాదగా తీసి పట్టుకున్న కేబ్ డోర్, తలుపులో పడకుండా సర్దే స్కర్ట్. నా చెయ్యేనా అతడిని కేబ్ లోకి లాగింది, నేనేనా కేబ్ డ్రైవర్‌కి నా హోటల్ అడ్రస్ చెప్పింది, అతనా?

నవలా రచయితగా సుబ్రహ్మణ్య శాస్త్రిగారి గురించి చెప్పుకోవలసిన అంశాలలో ప్రధానమైనది భాష. భాష విషయంలో ఆయనలో క్రమక్రమంగా వచ్చిన మార్పుకు ఈ నవలలు దర్పణాలు. మొదటి రెండు నవలల్లోనూ పండిత లోకం శిరసున ధరించే వరమ ప్రామాణికమైన గ్రాంథిక భాష. వర్ణనాత్మకమయిన శైలీ విన్యాసంతో అలరారిన భాష. నవల మొదలుపెడితే ఆపకుండా చదివించగల ధారాప్రవాహం లాంటి సారళ్యతను ఆ గ్రాంథిక రచనలో కూడా సాధించగలగడం శాస్త్రిగారి విశేష ప్రజ్ఞ.

ఏవూరిసిన్నదో ఎవ్వారి సిన్నదో
ఈడేరి వున్నది ఇంచక్క వున్నది
కొప్పేటి ముడిసింది కోకేటికట్టింది
సూపేటి సూసింది నడకేటి నడిసింది
సుడిగాలిలా నన్ను సుట్టపెట్టేసింది

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.