అబద్ధాలాడకూడదు. నిజఁవే. కాని, మనసులో ఉన్నవన్నీ చెప్పకూడదు అని ఈమధ్యనే తెలిసింది. అందులోనూ, అమ్మా బామ్మా లాంటివాళ్లతో. నాకు ఏఁవిటో బాగోలేదు. నాకు ముసురు పట్టింది అని చెప్పేననుకో. ఇంక చూడు రాద్ధాంతం చేస్తారు. దిష్టి తీస్తారు. తాయెత్తు కడతామంటారు. ఆంజనేయస్వామి బిళ్ళ గొలుసు మెళ్ళో వేస్తామంటారు. అందుకని అబద్ధం ఆడొచ్చు!

అతీతవాహకత్వం ఇంకా ప్రయోగశాలలకే పరిమితం కానీ అర్ధవాహకాలు (semiconductors) మన దైనందిన జీవితాన్నే పూర్తిగా మార్చివేశాయి! ఈ రోజుల్లో ట్రాన్సిస్టర్లు, చిప్పులు (chips), కంప్యూటర్లు, సెల్ ఫోనులు, లేసర్లు, వగైరాలు లేకుండా మనకి రోజు గడవదు కదా!

వీధి చివర మలుపు అంచున వున్న దీపస్తంభపు తీగ గాలి ఊయల వూగుతుండగా దానిని వేళ్ళ మధ్య ఉన్న నా కలంతో చలన స్తంభన విద్యకు కట్టుచేసి కాగితంలోకి చేర్చడంలో వున్న మహదానందాన్ని నేను మరెక్కడా పొందలేదు. నాకు ఊహ ఎరిగిననాటి నుండి ఇప్పుడు ఇంతవాణ్ణి అయ్యాకా కూడా నా జీవితంలో నేను బొమ్మ వేయకుండా వున్న ఒక్క రోజు లేదు.

ఆ మాట మరి దేనికో తగిలినట్టయిన రంగారెడ్డిలో మళ్లీ తెలియని భయం ప్రవేశించింది. తెలియకుండానే జేబు మోస్తున్న బరువు స్పృహలోకి వచ్చింది. ఊహల్లో ఉన్నదాన్ని వాస్తవంలోకి తేవడానికి తను పెట్టుకున్న గడువు మరీ దగ్గరగా ఉందేమో. కాలేజీలో చేయలేని ధైర్యం క్యాంపులో మాత్రం వస్తుందా? ఇది కొంత ఇన్‌ఫార్మల్‌గా ఉండగలిగే జాగా కావడంతో ఎక్కువ వీలు ఉంటుందనిపించింది.

గూఢచారి కోడిపెట్ట: యాజమాన్యం ఎప్పుడూ పనివారిమీద ఒక కన్నేసి ఉంచాలి. కేవలం వారితో సమర్థవంతంగా పని చేయిస్తే సరిపోదు. వారి మెదడులోనూ ఖాళీలుంచకూడదు. అలా ఖాళీ ఉండి, పనివారికి ఆలోచనలొచ్చినప్పుడల్లా చరిత్రలో ఏం జరిగిందో, యాజమాన్యం వారికి తెలుసు. అందుకే వారి ఆలోచనల్లో ఎప్పుడూ కుట్ర గురించిన భయాలుంటూనే ఉంటాయి.

దానిబలమే నా ఊపిరి
ప్రతిక్షణం, ప్రతీ ఘడియా
దానివల్లే!

గుప్తంగా దాంట్లోనే
నా గుండె చప్పుళ్ళు
దాక్కుని ఉన్నాయి.

తనంతే. భావోద్వేగాలు నియంత్రించుకోలేదు. ఏవైనా ప్రకృతి ఉత్పాతాలు, ప్రమాదాలు, కరోనా కాలంలో వలస జీవుల వెతలు, మరణాలు… టీవిలో చూస్తే ఏడ్చేస్తుంది. ఎవరి కష్టాలు చూసినా ఏదో ఆందోళన. పెళ్ళి అప్పటి కన్నా ఇప్పుడు చాలా నయం. మందులేవైనా రాసిస్తారా అనడిగేవాడిని మా డాక్టర్‌ని. మీ ప్రేమే మందు అనేవారాయన. తన గురించి ఆయనకి పూర్తిగా తెలుసు.

వద్దన్నా కాళ్ళకు చుట్టుకుంటున్న
తీగలను విదిలించడమెలాగో
తెలియని స్ధితి
తెలియని కలవరపాటుతో
ఊహల ఉలికిపాటు

చీకట్లోకి చూపులు పాతేస్తూ
ఆలోచనలను పాతరేస్తూ
గూట్లో ఒదిగిన పిట్ట

ఇన్నాళ్లూ నన్ను చిత్రించుకుని మురిసిన
నుదురుగోడ మసకబారుతుంది.
నా గుండెపువ్వుపై చలాకీగా ఎగిరే
తూనీగల రెక్కలు ముడుచుకుంటాయి.
నాలోంచి ప్రవహించిన అక్షరాలన్నీ
నా ఛాయాచిత్రం ముందు చేరి
దీపాలై వెలుగుతుంటాయి.

ఈ నవలలో అతను తీసుకున్న జీవితం వాస్తవం, గతానికి చెందిన వాస్తవం. దీన్ని చిత్రించటానికి రచయిత చరిత్రతో దిగిన సంభాషణలో రచయితకు అనేక పాత్రలు తారసపడ్డాయి. అతనితో ఘర్షణపడ్డాయి. ఆ తరువాత అతని నుంచి స్వయం ప్రతిపత్తి కల్పించుకుని తమని గురించి తామే యదార్థంగా పరిచయం చేసుకుంటామని కథకుడితో తెగేసి చెప్పాయి.

చివరికి ఒకరోజు పిల్లయింటివాళ్ళు వచ్చి లగ్నపత్రికలు కూడా రాసుకొని పోయారు. అయ్యో! ఆ రోజు మేళం శబ్దం విని నా పంచప్రాణాలు పోయాయి. కామేశ్వరయ్యరుకు యెలా ఉందో, మీనాక్షి మనసు ఎంత తల్లడిల్లిందో, రుక్మిణి ఎలా సహించిందో! అంతా ఈశ్వరునికే తెలుసు. నాగరాజన్‌కు పిసరంత కూడా దయ, పశ్చాత్తాపం లేకుండా పోయింది కదా అని నేను యేడవని రోజు లేదు.

కాసేపటికి ఒక పడవ నెమ్మదిగా అటువైపు వచ్చి గుడిసె ముందున్న కొబ్బరి చెట్లకు సమీపంలో ఆగింది. దాని ఆశలు మళ్ళీ చిగురించాయి. ముందుకాళ్ల మీద సాగిలపడి, తోక ఊపుతూ ఆవలించింది. పడవలోంచి ఒకడు కొబ్బరి చెట్టెక్కి, ఒక కొబ్బరి బోండాం కోసుకొని నీళ్ళు తాగి, దొప్పల్ని నీళ్లలో విసిరేసి, పడవ నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. కుక్క నిరాశతో చూస్తూ ఉండిపోయింది.

నాకున్న కల్పనా సామర్థ్యమంతా, విజిటింగ్ కార్డులని తయారు చెయ్యడంలో చూపిస్తుంటాను. నా ప్రింటింగ్ వర్క్‌లో, నా అడ్రస్ కార్డ్‌లు నేనే తయారుచేసి, ఊళ్ళో నాకు కనపడ్డవాళ్ళందరికీ ఇచ్చాను. వాటికున్న ప్రయోజనాన్ని కూడా విప్పి చెప్పాను. మెల్లిమెల్లిగా మా పేటలోవాళ్ళే కాకుండా, చుట్టుపక్కల పేటల్లోనివాళ్ళు కూడా తమ విజిటింగ్ కార్డ్‌లని నా దగ్గర ప్రింట్ చేయించుకోవడం మొదలుపెట్టారు.

అందువలన భారతదేశప్రభుత్వము బ్రిటీషువారి చేతులలో నుండి భారతీయుల చేతులలోనికి ఎంత త్వరితముగమారిన నంత మంచిది అనుభావము వ్యాపించెను. అయితే ఈ భావము ఇంగ్లాండులోనెంత తీవ్రముగ వ్యాపించియున్నదో భారతదేశీయులెరుగరు. బ్రిటిషువారు చెప్పు మాటలను భారతీయులు విశ్వసింపరైరి. లూయీఫిషరుగారి గాంధీజీ జీవితములో ఈ సంగతిని చెప్పియున్నారు.

ఒకసారి చదివి వదిలేసే నవలగాదు. అలా చేస్తే ఆ అనుభవం ‘కష్టాల కొలిమి’ అనిపించే అవకాశం ఉంది. రెండోసారీ మూడోసారీ చదవడం, అనువాదం కోసం ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్నీ మథించడం – ఏ నవల విషయంలో అయినా ఇవి ఒక సమగ్ర అవగాహనకు రహదారి అవుతాయి. ఈ నవల విషయంలోనూ అదే జరిగింది.

రెండు దారులుంటాయి. ఒకటి నలిగిన, ఎవరినీ ఇబ్బంది పెట్టని, దేనితోనూ పేచీ లేని, అందరికీ ఆమోదయోగ్యమైన దారి. మరొకటి దాన్ని ఒప్పుకోలేని, రాజీ పడలేని, తోడు దొరకని, తనకు నచ్చిన సూటి బాట. ఏదీ తేలిక కాదు. ఏ బాట పట్టినా యుద్ధం లోపలి మనిషితోనో, బయటి సమాజంతోనో తప్పనిసరి అవుతుంది కొందరికి ఈ కథల్లోని పాత్రలకు లాగే.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.