పండు అనుకుని ఆంజనేయుడు సూర్యుడి దగ్గరకి ఆకాశంలో ఎగిరి వెళ్లేడు. మీదికి బాగా లేచేక బాగా వేడెక్కిపోతాడెమో! పొద్దున్నే అంత వేడిగా ఉండడేమోలే! కాస్త కాలితే కాలింది అనుకుందామంటే అందడు కదా! గాలికి పుట్టేడు కాబట్టి ఆంజనేయుడు ఎగిరివెళ్లేడు. నేనెలా వెళ్తానూ? ఎగరలేనే! ఎలా సూరీడిని రాకుండా చెయ్యాలీ? తెల్లారకుండా ఎలా చెయ్యాలీ?

ఇంటికి ఎవరెవరో వచ్చారు. అటూ ఇటూ హడావిడిగా తిరుగుతున్నారు. బయటికేగాని లోపల ఎవరికీ డాలీని పట్టించుకోవాలని ఉన్నట్లు లేదు. నాకు సంతోషమేసింది, డాలీని నిజంగా ఎవరూ పట్టించుకోవట్లేదు. కానీ డాలీ కూడా ఎవరినీ పట్టించుకోవట్లేదు. ఆడుకొంటున్న పిల్లల దగ్గర ఉంది. ఎవరితో కలవకుండా అందరినీ పరిశీలనగా చూస్తున్నట్లు అనిపించింది. నిజంగానే డాలీ ప్రత్యేకమా?

స్త్రీపురుష సంబంధాల్లో భావోద్వేగాల కంటే ఇంగితజ్ఞానానికి, ప్రణయవేగం కంటే పరస్పరగౌరవానికి, ఆర్ధిక సమానతల కంటే బౌద్ధిక సమానతలకూ ప్రాధాన్యం ఇచ్చిన రచయిత్రి జేన్. ఆమె నవలల్లో స్త్రీపురుషులిద్దరూ విలువల్లో, జీవన విధానంలో, ప్రాపంచిక దృక్పథంలో సమవుజ్జీలుగా ఉన్నపుడే ‘ప్రేమ’ అనే పదానికి అర్థం ఉంటుంది.

“మీ ఈ తర్కం తప్పు. గురుదేవులు ఇలాంటి ప్రశ్నలకి జవాబు ఇవ్వద్దని చెప్పారు. ఎవరూ నా ప్రశ్నకి సరైన సమాధానం ఇవ్వడమే లేదు. భార్యని అడిగాను నేనెవర్ని? అని. ఆమె బదులిచ్చింది, నువ్వు నా భర్తవి. పెద్ద కొడుకుని అడిగాను నేనెవర్ని? అని వాడు బదులిచ్చాడు, నువ్వు నాన్నవి. ఆఫీసులో మా మేనేజర్‌ని అడిగాను సార్ నేనెవర్ని? అని. నువ్వు పిచ్చివాడివి, అని ఆయన జవాబు.”

కట్టిన పుట్టమేమి, కనకాంబరమా? కరితోలు! నెత్తిపై
బెట్టినదేమి, మత్త శిఖిపింఛమ? ఉమ్మెత గడ్డిపువ్వు, మై
దట్టిన దేమి, చందన కదంబరమా? తెలి బూది! నిన్ను జే
పట్టిన రాచ పట్టి చలువన్ పరమేశ్వరుడైతి ధూర్జటీ!

వెచ్చని సముద్రతలం మీద
చేపల చాపల కోసం
పడవ ప్రయాణం
లంగరేస్తే బట్ట నిలువదు
సహస్రాక్షుడి సహపంక్తి భోజనం
వేదాలు, హాలాహలము
మోసానికి మొదటి పాఠాలు

నీడల్ని పెకలించుకుని
శూన్యం ఊడ
ఇళ్లల్లోకి ఎప్పుడు దిగబడిందో తెలీదు
బయటకి ఇళ్లన్నీ ప్రశాంతంగా కనబడుతున్నా
లోపల గదులు గదులుగా శూన్యం
ఎప్పుడు విస్తరించిందో తెలీదు

బిడ్డకొచ్చిన కష్టంతో కుంగిపోయి వున్న కమలాంబాళ్ తనేం చేస్తున్నాననే స్పృహ లేకుండా, యింటి ముందుకెళ్ళి, ఆ మందులోడితో తన గోడు వెల్లబోసుకుంది. వాడు ఆమెకు కొంచెం విబూతి, కొన్ని మందు ఆకులు యిస్తూ చెప్పాడు. “విబూతి నుదుటిన రాయి. ఆకుపసురు చేతికి పూయి. కనికట్టు వేసినట్టు అంతా మాయమయిపోతుంది. కలత చెందకు అమ్మన్నీ, పళని స్వామి నిన్ను పరిరక్షిస్తాడు.”

తనని తాను చూసుకొంటోంది
గాలికి ఎగురుతున్న పేపరు కొసల్లో
ఆమె వస్త్రాలపై వాలుతున్న ఎండలో

వింటోంది తనని తాను
టీవీలోంచి పొడిగా రాలుతున్న శబ్దాల్లో
వాహనాల తొందరలో, మనుషుల చప్పుళ్ళలో

కళ్ళనో గుండెనో మెత్తగా తాకే క్షణాలైనా
సరదా సరాగాల చెలిమి సమయాలైనా
బంధాలు బంధనాల వంతెనపై
బహిరాంతర్లోకాల నడుమ
నిరంతర వాత్సల్య చలనాలవుతాయి
గుట్టలుగా రాలిపోతున్న క్షణాల మధ్య
బుట్టలుగా పోగుపడే జ్ఞాపకాల రాశులవుతాయి.

కట్టలు తెంచుకోలేని గొంతుకు
గంతలు కన్నీరు పెడుతుంటే
బరువును తూచలేని త్రాసుతో
విలువ తూలిపడుతుంటే

మళ్ళీ నల్ల కోట్ల
తెల్లని నటన
ఎర్రని వాదన

చక్కటి తెలుగు పదం ‘దీవెన’ అని కేతన వాడినా దీనిని సంస్కృతీకరించి ‘ఆశీరర్థకం’ అని వాడటం వల్ల తర్వాతి కాలంలో ఇంతకుముందే చెప్పినట్లు వ్యాకరణ పరిభాషలో క్లిష్టత ఏర్పడి సామాన్యులకు అర్థం కాకుండా పోయింది. తేలికైన మాటలలో, సులభమైన శైలిలో వ్యాకరణం ఎలా రాయవచ్చో కేతనను చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది.

బడిలో చదువుకొనేటప్పుడు మనము ఉత్పలమాలకు గణములు భ/ర/న/భ/భ/ర/వ, శార్దూలవిక్రీడితమునకు గణములు మ/స/జ/స/త/త/గ, ఇలా చదువుకొని జ్ఞాపకములో పెట్టుకొనేవాళ్లము. ఒక్కొక్కప్పుడు అనిపించేది మఱేదైనా సులభ మార్గము ఉంటే బాగుంటుందని. సార్థకనామ గణాక్షర వృత్తములలో ఈ ఇబ్బంది ఉండదు. గణముల పేరులు వృత్తముల పేరులో ఉంటాయి.

ఈ పదిహేనేళ్లలో సేకరించిన సమాచారం/పాటల-లో ‘చల్ మోహనరంగా’ అన్న నిడివైన పాట ఒకటి ముఖ్యమైనది. ఈ సంచికలో కేవలం ఆ పాట ఆధారంగా తయారయిన ఒక లఘు చిత్రం గురించిన వివరాలు చూద్దాం. దీన్ని వాలి సుబ్బారావు, పుష్పవల్లి పైన చిత్రీకరించారు.

శ్రీశ్రీ రాతలతో పరిచయం వున్నవారికి ‘హరీన్‌ చటో, గిరాం మూర్తి ఇటీవల మా ఇన్స్పిరేషన్’ అన్న శ్రీశ్రీ మాట తెలుసు. శ్రీశ్రీ సప్తతి ఉత్సవాలు కాకినాడలో జరిపినప్పుడు హరీన్ చటోని ఆహ్వానించారు. ఈ సప్తతి సభకి ఆయనే అధ్యక్షుడు. మంచి నటుడు, గాయకుడు, హార్మోనియం బాగా వాయించేవాడు.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.