ఒకటి అనుకుంటానా, ఇంకేదో గుర్తుకు వస్తుంది. దాంతో మరోటేదో వచ్చేస్తుంది. పరిగెట్టుకెళ్లి చెప్పకపోతే నా బుర్రలోంచి అది ఎగిరి చక్కాపోతుంది. అవునూ, ఎగిరి ఎక్కడికి వెళ్తుందీ? పిట్టలు ఓ చెట్టు మీంచి మరో చెట్టు మీదికి ఎగిరి కూచుంటాయి. ఒకటా రెండా? ఎన్నో చెట్లు! నా బుర్రలోంచి ఎగిరి బహుశా మరో బుర్రలోకి దూరిపోతుంది కాబోలు! ఒకటా రెండా? ఎన్నో బుర్రలు!

ఇలా మానవాతీత శక్తులు లేవని, అవి మన ఊహాజనితాలనీ చెప్పడం వల్లనే కాబోలు 20, 21వ శతాబ్దుల్లోనూ ఆన్ రాడ్‌క్లిఫ్ ఒక సంచలన రచయిత్రిగా సాహిత్యవేత్తల మన్ననను పొందుతోంది. ఇది మౌలికంగా సెంటిమెంటల్ నవలే. కానీ అందులో సస్పెన్స్‌నూ, థ్రిల్‌నూ పొందుపరచడంలో ఆన్ రాడ్‌క్లిఫ్ చూపిన ప్రతిభ వల్ల ఇది ఒక అసాధారణ రచన అయింది.

నాకు మాత్రం ఆ నదిలో కొట్టుకొస్తున్న శవాలు కనిపిస్తున్నాయి. నాని ఉబ్బిపోయిన శవాలు. కుక్కలు పీక్కొని తిన్న శవాలు. ఆనవాలు పట్టలేని శవాలు. గంగా! పాప వినాశినీ! మా ధర్మచరితకు పవిత్రసాక్షివి! శివుని జటాజూటంలో కొలువైన ఉగ్రతేజానివి! ఎందుకు రహస్యాలు నీలోనే దాచుకోవడానికి నిరాకరించావు?

మరియమ్మ ఒడిలో వాడు ఆడుకుంటున్న క్షణాలు అస్సలు నచ్చనివి. మరియమ్మ వాడినే కలవరిస్తా పోయింది. నన్ను కదా ఆమె మొదట పెంచింది. ఏదడిగినా ఇచ్చాను ఆయమ్మైనా కూడా. అయినా వాడినే ఇష్టపడింది, వాడు అమ్మా అనేవాడనా? చివరికి లక్ష్మి కూడా వాడిని నవ్వుతున్న కళ్ళతో చూసేది. ఆ చూపుల్లో ఇష్టం. అది నా జీవితంలోకి కదా వచ్చింది? నావైపు భయంతోనో భక్తితోనో చూసేదే తప్ప ఏవి ఆ ఇష్టపడే కళ్ళు?

నిసి అతని ఆదుర్దా చూసి, ఎవరితని కంపానియన్స్? గ్రిజ్లీ బేర్స్‌ని గాని ఇతడు ఇన్వైట్ చెయ్యలేదు కదా, అనుకుంది. అంతకు ముందే ఆమె హోటల్ వారి వార్నింగులు చదువుకుంది. ఫోర్ సీజన్స్ బైటి రోడ్డు కొంత భాగం మూసివేసినట్టు, అటవీశాఖవారు ఒక ఎలుగుబంటి ఫామిలీ కోసం వెతుకుతున్నట్టు, బైట నడవొద్దని, బేర్ స్ప్రేలు దగ్గర పెట్టుకోమని, న్యూస్ రిలీజ్‌లు ఫాలో అవ్వమని సందేశం.

అర్ధరాత్రి దాటాక డ్యూటీ కాగానే తన గదికి వెళ్ళేవాడు. హోటల్ కేరేజీలో ఉన్న భోజనం తినేవాడు. నిద్రపోయేవాడు. కొన్ని రాత్రుళ్ళు ప్రెస్ క్లబ్‌కో, వేరే ఎక్కడికో వెళ్ళి బాగా తాగి ఏవేవో వాగేవాడు, పెద్దగా ఏవేవో పాడేవాడు. తన మనసు లోలోపల తనకే తెలీకుండా పేరుకున్న సున్నితమైన కోరికలను, ఆశలను మద్యంతో కడిగి బయటకు పంపుతున్నట్టు ఉండేది ఈ తాగుడు తంతు. కాని, శరీరాన్ని మోసం చెయ్యడం వీలయ్యేది కాదు.

హాప్కిన్స్ విక్టోరియాయుగపు వాడు. టెన్నిసన్, బ్రౌనింగ్, స్విన్‌బర్న్‌లకు సమకాలికుడు. కాని కవిగా వాళ్లలో చేరడు. అతడు యిరవయ్యవ శతాబ్దపు ఆధునిక కవి. ఎలియట్ తన గురించి అన్నాడు: తాను ఆధునికుల్లో పురాతనుడు, పురాతనుల్లో ఆధునికుడు అని. హాప్కిన్స్ ఆంగ్లోశాక్సన్ మూసలోని ఆధునికుడు.

సూర్యోదయం మొదట్లో పొడవుగా సాగిన నీడ మధ్యాహ్నం సూర్యుడు నెత్తిమీదకు వచ్చే వేళకి చిన్నదవుతూ, మళ్ళీ పొడవుగా సాగుతుందన్న విషయం మనకు తెలుసు. కనుక నీడ పొడవును బట్టి, అది మధ్యాహ్నమైతే, ఇంకా సూర్యాస్తమయానికి 7 గడియల పొద్దు ఉందనీ, అదే ఉదయపు నీడ అయితే, సూర్యోదయం అయి 7 గడియల పొద్దు అయిందనీ తెలుసుకోవచ్చు.

త్రిభంగి అంటే మూడు భంగములు గలది. భంగము అంటే ఇక్కడ విఱుపు. అనగా పాదము స్పష్టముగా మూడు విఱుపులతో నుండాలి. ఈ విఱుపులకు అంత్యప్రాస కూడ ఉంచుట వాడుక. సామాన్యముగా మూడు అంత్యప్రాసలు ఉంటాయి. ఈ త్రిభంగి పుట్టు పూర్వోత్తరాలు సరిగా తెలియవు.

అప్పుడు నీ గర్భాన్ని
నా పసికాళ్ళతో తట్టినప్పుడు
నువ్వెన్ని పూలతోటలై నవ్వేవో
తెలీదు కానీ
ఇప్పుడు నీ జ్ఞాపకాలు
నా గుండెల్ని తడుతుంటే
కన్నీటి మేఘాన్నవుతున్నాను.

ఇలాగే ఇందుకే ఉన్నామనుకుంటూ
గుర్తులు చెక్కుకుంటూ
వత్తులు దిద్దుకుంటూ
వలయాల్లోని వలయంలోకి
విజయాల్లోని విలయంలోకి
ఒకింత మరి కాస్తంత కించిత్పూర్తిగా
విలుప్తమై వినీలంలో విలీనమైపోతూ

చీకటిని చీల్చుకొని వెలిగే మెరుపు తీగ
వేదనల వణుకును పోగొట్టే నెగడుగా
ఎప్పటికీ మారదు

తళుక్కున మెరిసిన ఇంద్రధనుస్సు
తెల్లని నవ్వై తేలిపోతుంది
అసలు రంగేదో నువ్వు గుర్తించేలోగానే

– మన పురాపారవశ్యాలు నీకు గుర్తుకు వస్తున్నాయా?
– నేనేమి గుర్తు ఉంచుకోవాలని నువ్వు ఆశించావు?

నా పేరు వినగానే నీ హృదయం ఇంకా స్పందిస్తుందా?
ఇప్పటికీ కలలో నీకు నా మనసు ఊసు వినిపిస్తుందా? – లేదు!

ఈ క్షణమొకసారి పిల్లకాలువ
తేలికగా ప్రవహిస్తూ పోతుంది
ఒక్క గెంతులో దానిని దాటగలుగుతావు
మరొకసారి మహాసముద్రం
దానిలో మునిగిపోకుండా నిలబడటానికి
నీ శక్తులన్నీ ఒడ్డుతావు

ఒకసారొక చినుకు
గుర్తించేలోపు పలకరించి మాయమౌతుంది

తెలుగులో ఈ సమాసాలకు సంబంధించిన అవగాహనంతా సంస్కృతం నుండి తెచ్చుకున్నదే. అందువల్ల పాఠశాల స్థాయినుండి స్నాతకోత్తర స్థాయివరకూ సమాసాల కన్నా వాటి సాంకేతికపదాల విషయంలోనే విద్యార్థులు ఇబ్బందులు పడుతూండటం గమనార్హం. కేతన ఇచ్చిన నిర్వచనం చిన్నయసూరి పై నిర్వచనం కన్నా సులభంగా అర్థమవుతూందన్నది ఎవరైనా నిర్వివాదంగా అంగీకరించాల్సిందే.

[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

క్రితం సంచికలోని గడినుడి-55కి మొదటి ఇరవై రోజుల్లో పదిహేడు మంది దగ్గరినుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-55 సమాధానాలు.